ఆ హీరోతో చేయాలని ఉంది: సందీప్ వంగా

SMTV Desk 2019-10-23 16:07:18  

మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేయాల‌ని నేటి త‌రం యువ ద‌ర్శ‌కులు చాలా మంది ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కాగా ఇటు టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి.. అటు బాలీవుడ్‌లో క‌బీర్ సింగ్ చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు సందీప్ వంగా కూడా చిరంజీవితో సినిమా చేయాల‌నుకుంటున్నారు. రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో కొంత మంది మిత్రుల‌తో ఆయ‌న మాట్లాడార‌ట‌. ఆ స‌మ‌యంలో చిరంజీవి వ‌య‌సుకు, స్టార్‌డ‌మ్‌కు త‌గిన‌ట్లు త‌న ద‌గ్గ‌ర ఓ క‌థ ఉంద‌ని ఆయ‌నకు ఆ క‌థ‌ను చెప్పాల‌నుకుంటున్నాన‌ని, ఆయ‌న్ని డైరెక్ట్ చేయాల‌నుకుంటున్నాన‌ని కూడా తెలిపారాయ‌న‌. మ‌రి సందీప్ విష‌యం మెగాస్టార్ వ‌ర‌కు వెళుతుందో లేదో వేచి చూడాలి.