ప్రియురాలితో సెక్స్ చేస్తుండగా చూశాడన్న కోపంతో కొట్టి చంపాడు!

SMTV Desk 2019-10-22 12:16:25  

తన ప్రియురాలితో సెక్స్ చేస్తుండగా చూశాడన్న కోపంతో ఓ వ్యక్తి మరొక వ్యక్తిని దారుణంగా చంపాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకున్న ఈ ఘటన పూర్తీ వివరాల ప్రకారం.... ఫ్లోరిడాకు చెందిన వికర్ట్ విక్కరీ(30) అనే వ్యక్తి తన ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆమె ఇంట్లో ఎవరూ లేకపోవడంతో శృంగారం చేసుకునేందుకు ప్రేమికులు సిద్ధమయ్యారు. విక్టర్ తన ప్రియురాలిని బెడ్‌రూమ్‌కి తీసుకెళ్లి రాసలీలలు మొదలుపెట్టాడు. ఇద్దరూ నగ్నంగా మారి సెక్స్‌కు సిద్దమవుతుండగా కిటికీ దగ్గర అలికిడి అయింది. దీంతో విక్టర్ ఏమైందోనని తెలుసుకునేందుకు దుస్తులు వేసుకుని కిటికీ దగ్గరకు వెళ్లాడు. అక్కడ అసాద్ అకర్(57) అనే వ్యక్తి కనిపించడంతో ఇక్కడేం చేస్తున్నావంటూ విక్టర్ నిలదీశాడు. అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో విక్టర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అసాద్‌పై పిడిగుద్దులు కురిపిస్తూ చితకబాదాడు. ఈలోగా విక్టర్ ప్రియురాలు పోలీసులకు ఫోన్ చేయడంతో కాసేపటికి అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వచ్చేసరికే అసాద్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు విక్టర్‌ను అరెస్ట్ చేశారు. మరోవైపు అసాద్ గతంలోనూ ఇలాగే చాలా ఇళ్లల్లో జంటలు సెక్స్ చేసుకుంటున్న సమయంలో చూసినట్లు స్థానికులు చెబుతున్నారు.