కొత్త జీపు తీసుకున్న ధోని

SMTV Desk 2019-10-22 12:14:39  

మహేంద్రసింగ్‌ ధోనీ గ్యారేజీలోకి మరో కొత్త వాహనం చేరింది. ధోనీకి కార్లు, బైక్‌లు అంటే ఎంతో ఇష్టం. తాజాగా ఆయన మరో కొత్త జీపు కొన్నాడు. అయితే ఈ సారి కాస్త విభిన్నంగా భారత సైనికులు ఉపయోగించే నిసాన్‌ జోంగా మోడల్‌ జీపును ఇష్టపడ్డాడు. రాంచీ వీధుల్లో దీన్ని నడుపుతూ ఆస్వాదించడంలో బిజీగా ఉన్నాడు ధోనీ. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ ధోనీ గ్రాండ్‌ చెరోకీ జీపును కొన్నాడు. ఆ జీపు ఇంటికి వచ్చిన సమయంలో ధోనీ సైనిక విధుల్లో ఉండటంతో ఆయన భార్య సాక్షి ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా.. వైరల్‌గా మారింది.