ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ..!!

SMTV Desk 2019-10-22 12:14:13  

నవంబర్‌ 1న రాష్ర్ట అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ర్ట, జిల్లా స్థాయిలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. రాష్ర్ట అవతరణ దినోత్సవం నిర్వహించడం ఇదే తొలిసారి. గత టీడీపీ ప్రభుత్వం అవతరణ దినోత్సవం నిర్వహించలేదు. దీంతో ఇప్పుడు కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ర్ట అవతరణ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది.