ఇన్ఫోసిస్ పై గుర్తుతెలియని ఉద్యోగుల ఆరోపణలు!

SMTV Desk 2019-10-22 12:12:30  

ఐటి సేవల సంస్థ ఇన్ఫోసిస్ పై ఆరోపణలు వచ్చాయి. ఇన్ఫోసిస్ తన ఆదాయాన్ని, లాభాలను ఎక్కువగా చూపేందుకు అనైతిక చర్యలకు పాల్పడుతోందనే ఒక విజిల్ బ్లోవర్ ఐటి సంస్థ ఈ ఆరోపణలు చేసింది. కంపెనీ సిఇఒ సలీల్ పరేఖ్, సిఎఫ్‌ఒ నిలంజన్ రాయ్‌లు అనైతిక విధానాలను అవలంభిస్తున్నారని కొంతమంది గుర్తుతెలియని ఉద్యోగులు ఆరోపించారు. ఈ ఆరోపణలను నిరూపించడానికి తమ వద్ద ఇ-మెయిల్స్, వాయిస్ రికార్డింగ్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఇన్ఫోసిస్ ఈ ఫిర్యాదును తన ఆడిట్ కమిటీకి సూచించింది. కంపెనీ నిబంధనల ప్రకారం విజిల్ బ్లోవర్ ఫిర్యాదును ఆడిట్ కమిటీకి పంపామని, తదుపరి చర్యలు తీసుకుంటుందని ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో పేర్కొంది.