విజయ్.. ప్రియా.. రొమాన్స్..!

SMTV Desk 2019-10-21 19:01:47  

సినిమా అంటే ఇలానే చేయాలి.. హీరో అంటే ఇలానే ఉండాలన్న పరిధులను దాటేసిన హీరో.. ఇక హీరోయిన్ విషయానికి వస్తే కన్నుగీటి కురాళ్ల హృదయాలను కొల్లగొట్టిన భామ. యూత్ లో ఈ ఇద్దరి క్రేజ్ పీక్స్ అని చెప్పొచ్చు. అయితే ఈ ఇద్దరిని కలిపి సినిమా చేస్తున్నాడు క్రేజీ డైరక్టర్ పూరి జగన్నాథ్. ఇస్మరట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకున్న పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ చేశాడు.

ఫైటర్ టైటిల్ తో తెరకెక్కే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తుందని తెలుస్తుంది. ఒరు ఆధార్ లవ్ అదే తెలుగులో లవర్స్ డే సినిమాతో ప్రేక్షకులను అలరించిన ప్రియా ప్రకాశ్ తెలుగులో మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. అయితే అమ్మడికి ఇప్పుడు వరుస వెంట లక్కీ ఛాన్సులు వస్తున్నాయి. ఇప్పటికే నితిన్, చంద్రశేఖర్ యేలేటి మూవీలో ఛాన్స్ దక్కించుకున్న ప్రియా ప్రకాశ్ లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ సినిమాలో కూడా నటిస్తుందని తెలుస్తుంది.

విజయ్ లాంటి క్రేజీ హీరో పక్కన ప్రియా ప్రకాశ్ లాంటి హీరోయిన్ నటిస్తే ఎలా ఉంటుందో చూడాలి. పూరి లాంటి డైరక్టర్ చేతిలో పడితే ఏ హీరోయిన్ అయినా దశ తిరగాల్సిందే. మరి ప్రియా ప్రకాశ్ దశ కూడా ఫైటర్ సినిమాతో తిప్పేస్తాడా లేదా అన్నది చూడాలి.