కబడ్డీ లీగ్ 7....నేడు ఫైనల్

SMTV Desk 2019-10-19 14:44:42  

కబడ్డీ లీగ్ 7లో నేడు ఆఖరి పోరు జరగనుంది. దబాంగ్ ఢిల్లీ-బెంగాల్ వారియర్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొదటిసారి ఫైనల్ చేరడంతో ఇరుజట్లు అంతిమ సమరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సెమీ ఫైనల్లో బెంగళూరు బుల్స్ ను చిత్తు చేసిన ఢిల్లీ ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో అడుగుపెట్టగా.. మరో సెమీస్ మ్యాచ్ లో యు ముంబాను మట్టికరిపించి ఢిల్లీతో ఢీకి సిద్ధమైంది బెంగాల్ వారియర్స్. రెండు జట్లలో రైడర్లు, డిఫెండర్లు ఎవరికి వారే అన్నట్టుగా రాణిస్తుండడంతో రసవత్తరమైన పోరు ఖాయంగా కనిపిస్తుంది.