ఉత్తర కొరియాపై అమెరికా బాంబు ప్రయోగం

SMTV Desk 2017-09-01 10:40:44  utharakoriya, japan, amerika, donald tramp, kim jang un, bom blast

ఉత్తర కొరియా, సెప్టెంబర్ 1 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియాను భయపెట్టాలన్న ఉద్దేశంతో ఉన్న దేశానికి సమీపంలో తమ యుద్ధ విమానాలతో బాంబు ప్రయోగం చేయించారు. ఉత్తర కొరియా సరిహద్దుల్లోని దక్షిణ కొరియా ప్రాంతంలో శక్తిమంతమైన బాంబులను విమానాలు జారవిడిచాయి. ఇటీవల ఉత్తర కొరియా జపాన్ మీదుగా పసిఫిక్ మహాసముద్రంలోకి మిస్సైల్ టెస్ట్ చేపట్టిన నేపథ్యంలో ఆ దేశానికి ఈ విధమైన సమాధానం చెప్పమని సైనిక అధికారులను ట్రంప్ ఆదేశించినట్లు సమాచారం. కాగా, ఈ విషయాన్ని గమనించిన కిమ్ జాంగ్ ఉన్ తీవ్రంగా స్పందిస్తూ, అమెరికా పై తాను ఒక్క క్షిపణి పరీక్షను చేస్తే ఆ దేశ పరిస్థితి ఏం మౌతుందో తెలిసిన విషయమేనని అన్నారు. ఈ మేరకు తమ దేశ సరిహద్దులో అమెరికా బాంబర్లు, యుద్ధ విమానాలు ఉండటంపై ఆయన మండి పడ్డారు.