కల్కి ఆశ్రమం వెనుక నిజాలేంటి ?

SMTV Desk 2019-10-18 16:45:44  

కల్కి భగవాన్ ఆస్తులపై వరుసగా మూడో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇవాళ తమిళనాడులోని పలు ప్రాంతాలతోపాటు, ఏపీలోని చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోనూ ఐటీ సోదాలు జరుగుపుతున్నారు అధికారులు. ఇప్పటికే కల్కి భగవాన్‌ ఆశ్రమాలపై దాడులుచేసి 8 కోట్లు సీజ్ చేశారు ఐటీ అధికారులు. తమిళనాడుతో పాటు ఆఫ్రికా దేశాల్లో భారీగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు . చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని కల్కి ఆశ్రమాల్లోనూ నిర్వహించిన తనిఖీల్లో.. పెద్ద మొత్తంలో నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క తమిళనాడులోనే వెయ్యి ఎకరాలకుపైగా భూములు కొనుగోలు చేసినట్టు అధికారుల సోదాల్లో తేలింది. ఎన్ని వివాదాలు చెలరేగినా.. ఆశ్రమంపై మాత్రం ఎప్పుడూ దాడులు జరగలేదు. కానీ, ప్రస్తుతం ఐటీ దాడులు జరగడానికి కారణం మాత్రం కల్కి భగవాన్‌ అనారోగ్యంతో ఉండడమే. మరోవైపు.. ఆధ్యాత్మిక ముసుగు ఉండతో రెయిడ్‌లో పాల్గొన్న వారంతా.. ఉత్తర భారతదేశానికి చెందిన అధికారులే ఉన్నారు. వారికి సెక్యురిటీగా.. తమిళనాడుకు చెందిన కేంద్ర బలగాలు ఉండడం విశేషం. ఇప్పటివరకూ నిర్వహించిన తనిఖీల్లో 33కోట్ల విలువైన నగదు పట్టుబడిందని, ఇందులో 24కోట్ల నగదు, 9కోట్ల విదేశీ కరెన్సీ పట్టుబడినట్టు సమాచారం. ఆశ్రమం పేరుతో కల్కి భగవాన్ వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం. ప్రజా సంక్షేమం పేరుతో కోట్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. హిందూ సంప్రదాయాలను దెబ్బతీసేలా కల్కి ఆశ్రయం పనిచేస్తోందని, దీని వెనుక ఉన్న నిజాలు బయటపెట్టాలని కోరారు. అసలు కల్కి అలియాస్ విజయ్ కుమార్ బతికే ఉన్నాడా లేదా అని ప్రశ్నించారు ఆదిమూలపు.