హుజూర్‌నగర్‌ లో కేసీఆర్ ఓడిపోయినట్టే

SMTV Desk 2019-10-18 16:45:03  

హుజూర్‌నగర్‌ లో ఎలాగైనా విజయాన్ని నమోదు చేయాలని అనుకుంటున్న టిఆర్ఎస్. ఈ నేపథ్యంలో నిన్న హుజూర్‌నగర్‌ లో టిఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం నిర్వహించేందుకు నిర్ణయించారు. కాని భారీ వర్షం కారణంగా కేసీఆర్ సభకు హాజరు కాలేదు. దింతో సభ రద్దయింది. అయితే కేసీఆర్ హుజూర్‌నగర్‌ సభకు హాజరు కాకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే తాజాగా టిఆర్ఎస్ నేత విజయశాంతి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసారు ."వాతావరణం అనుకూలించలేదు అన్న సాకుతో కెసిఆర్ గారు హుజూర్‌నగర్‌ పర్యటనను వాయిదా వేసుకోవడం వెనక అసలు మతలబు వేరే ఉంది. నిజంగా హుజూర్‌నగర్‌లో పర్యటించాలని సీఎం భావించి ఉంటే ...రోడ్డు మార్గం ద్వారా నైనా ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశం ఉంది. కానీ కేవలం హెలికాప్టర్ ద్వారానే హుజూర్‌నగర్‌కు వెళ్లాలని కేసీఆర్ భావించడానికి కారణం.. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నిరసన సెగ తగులుతుందేమో అనే భయం మెంటాడమే.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ మంత్రులను కొన్ని ప్రాంతాల్లో అడ్డుకోవడాన్ని చూస్తున్నాం. మంత్రుల పరిస్థితే తనకు కూడా పడుతుందేమో... చేదు అనుభవం ఎదురవుతుందేమో... అన్న టెన్షన్ దొరగారికి మొదలైనట్లుంది. అందుకే కేవలం 200 కిలోమీటర్ల దూరం ఉన్న హుజూర్‌నగర్‌కు రోడ్డు మార్గం ద్వారా వెళ్లే సాహసం చేయలేదని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. దొరగారు ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకోవడం ద్వారా ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పరోక్షంగా తన ఓటమిని అంగీకరించినట్లేనని భావించాల్సి ఉంటుంది." అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు.