బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కు షాకిచ్చిన ఆంధ్రా బ్యాంకు

SMTV Desk 2019-10-17 15:10:43  

వైసీపీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో మరోసారి వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కుటుంబం రూ.13 కోట్లకు పైగా బకాయి పడినట్టు ఆంధ్రా బ్యాంకు దినపత్రికల్లో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చిందని వెల్లడించారు. చంద్రబాబునాయుడి దొంగల ముఠా, ఆయన బీజేపీలోకి పంపినవాళ్లు అందరూ కలిసి లక్ష కోట్ల మేర బ్యాంకులను ముంచారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.