మీ లోకేశ్ లా మొద్దబ్బాయిలు కాదు!!

SMTV Desk 2019-10-17 15:04:39  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తిప్పికొట్టారు. నారా లోకేశ్ లా గ్రామ వాలంటీర్లు మొద్దబ్బాయిలు కాదంటూ ఎద్దేవా చేశారు. గ్రామ కార్యకర్తలుగా ఎంపికైన వారిలో ఎవరికీ ఓనమాలు రావట. ఇవి చంద్రబాబు చేసిన కడుపు మంట మాటలు. అందరూ తన కొడుకు లోకేశ్ లా మొద్దబ్బాయిలనుకుంటున్నాడు. లోకేశ్ తో పరీక్ష రాయించండి.. ఆయన కనీసం పది మార్కులు కూడా తెచ్చుకోలేరని ఉద్యోగాలు సాధించిన యువత ఇప్పటికే సవాలు చేశారు అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్ చేశారు.

ఎవరిచ్చారు మీకీ అధికారమంటూ చంద్రబాబు పదే పదే శోకాలు పెడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఎక్కడ మాట్లాడినా ఒక కమెడియన్ తరహాలో కార్యకర్తలను అహ్లాదపరచడం పైనే ఆయన దృష్టి పెట్టినట్టున్నారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఇలా ప్రశ్నించరాదనే కనీస సృహ కూడా లేదు అని ఎద్దేవా చేశారు.