రొమాంటిక్ సినిమాలో రమ్యకృష్ణ

SMTV Desk 2019-10-16 15:29:29  

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తనయుడు ఆకాష్ పూరి త్వరలో రొమాంటిక్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమా లో ఓ కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించనున్నారు. ఇక ఈ విషయాన్నిచిత్రయూనిట్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ ఫుల్‌లెంగ్త్‌ రోల్‌లో కనిపించనుందట, అంటే హీరో, హీరోయిన్లలో ఒకరి తల్లి పాత్రలో కనిపించనుందా..? అనే చర్చ సాగుతుంది.

ఇక రొమాంటిక్ సినిమాలో ఆకాష్‌ సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. అనిల్‌ పాడూరి ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూరి, చార్మిలు నిర్మించిన ఇస్మార్ట్‌ శంకర్‌ ఘనవిజయం సాధించటంతో ఈ సినిమా కూడా అదే సక్సెస్‌ను రిపీట్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌.