ఆ రోడ్లను హేమ మాలిని బుగ్గల్లా మెరిపిస్తాం.. !!

SMTV Desk 2019-10-16 15:28:53  

బీజేపీ నేత కైలాష్‌ విజయవర్గీయ బుగ్గల్లా మధ్యప్రదేశ్ లో రోడ్లు ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసారు మంత్రి పీసీ శర్మ . ఈ రహదారులకు త్వరలోనే మరమ్మత్తులు చేస్తామని అన్నారు అంతేకాదు ఈ రోడ్లని త్వరలో కాంగ్రెస్‌ లోక్‌సభ ఎంపీ, బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌ హేమ మాలిని బుగ్గల్లా తీర్చిదిద్దుతుందని ఆయన అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయ పరంగా పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో రోడ్లు వాషింగ్టన్‌ రోడ్ల కంటే మెరుగ్గా ఉన్నాయని మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ రెండేళ్ల కిందట చేసిన ప్రకటనను మంత్రి శర్మ ఎద్దేవా చేశారు.

వాషింగ్టన్‌ తరహాలో మధ్యప్రదేశ్‌లో రోడ్లను నిర్మిస్తే వాటి పరిస్థితి భారీ వర్షం కురిస్తే ఎక్కడికక్కడ గుంతలు పడి అధ్వాన్నంగా తయారయ్యాయని విమర్శించారుమంత్రి సజ్జన్‌ వర్మతో కలిసి శర్మ రహదారుల పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌లో రోడ్లు విజయవర్గీయ బుగ్గల్లా ఉన్నాయని వాటికి ప్లాస్టిక్‌ సర్జరీ అవసరమని వ్యాఖ్యానించారు. 15 రోజుల్లో రహదారులకు మరమత్తు చేసి హేమా మాలిని బుగ్గల మెరిసేలా చేస్తామని మంత్రి అన్నారు