వైరల్ అవుతున్న శ్రీరెడ్డి న్యూ పిక్స్

SMTV Desk 2019-10-16 15:26:25  

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే హాట్ నటి శ్రీరెడ్డి ఇప్పుడు తన గెటప్ మార్చేసింది. ఎప్పుడూ హాట్ ఫొటోలను పోస్టు చేసి కుర్రకారును రెచ్చగొట్టే శ్రీరెడ్డి ఇప్పుడు ఆధ్యాత్మికం వైపు మనసు మళ్లించినట్లు కనపడుతోంది. ఈ ఫొటో చూస్తే మీరూ అదే అనక మానరు. తాజాగా ఓ గుడికి వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రీరెడ్డి. ఎప్పుడూ హాట్ గ్యాలరీలు, సంచలన ట్వీట్లను మాత్రమే ట్వీట్ చేసే ఈ భామ ఇప్పుడు ఇలా ఆధ్యాత్మిక అవతారం ఎత్తేటప్పటికీ ఆమె ఫ్యాన్స్ నివ్వెరపోతున్నారు.
అంతేకాదు తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో తీసుకోవాల్సిన మెళకువలను సైతం శ్రీరెడ్డి ఉచిత సలహాల రూపంలో ఇచ్చేస్తోంది. ముఖ్యంగా ఏపీలో కరెంటు కష్టాలపై శ్రీరెడ్డి, సీఎం జగన్ మోహన్ రెడ్డికి తనదైన స్టైల్ లో సలహాలు ఇచ్చింది. అలాగే శ్రీరెడ్డి జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని కితాబునిచ్చింది. ఇదిలా ఉంటే శ్రీరెడ్డి అటు సినిమా రంగంపై కూడా తన ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్లు చేసింది. అలాగే పవన్ కళ్యాణ్ తో హారర్ సినిమా తీయాలంటూ తనదైన మార్కు పంచ్‌లు విసిరింది.