అనంతనాగ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

SMTV Desk 2019-10-16 15:25:46  

జమ్మూకశ్మీర్‌ అనంతనాగ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరుగుతోంది. ఈ తెల్లవారు జామున ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు అనంతనాగ్‌లోని ఒక ప్రాంతంలో నక్కినట్లు సమాచారం అందడంతో బలగాలు పెద్దసంఖ్యలో చేరుకున్నాయ్‌. రెండు వర్గాల మధ్యా భీకరస్థాయిలో కాల్పులు జరుగుతున్నాయ్‌. సమచారం అందుకున్న సైన్యం మరిన్ని బలగాలను మోహరించింది. ఆర్టికల్‌ 370 ఎత్తేసిన తరుణంలో లోయలో ఉగ్రవాదుల ఏరివేతకు ఆర్మీ ప్రాధాన్యం ఇస్తోంది. సరిహద్దు చొరబాట్లను అడ్డుకున్న సైన్యం.. లోయలో నక్కిన టెర్రరిస్ట్‌లను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్‌ చేపడుతోంది. అయినా వివిధ మార్గాల నుంచి జైషే, లష్కరేకు చెందిన 30 మంది ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం అందడంతో మరింత అప్రమత్తంగా ఉన్నాయి బలగాలు.