కల్కీ భగవాన్ ఆశ్రమాలపై ఐటీ దాడులు

SMTV Desk 2019-10-16 15:24:36  

చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని కల్కీ భగవాన్ ఆశ్రమాలపై ఆదాయ పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయ్‌. ఏపీ, తమిళనాడుల్లో కల్కీ ఆశ్రమం బ్రాంచ్ లు ఉన్న 25 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఆశ్రమం సీఈవో లోకేష్ దాసాజీ, ఇతర సిబ్బందిని ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కల్కీ భగవాన్ కుమారుడు కృష్ణాజీ కేంద్రంగా వరదయ్యపాళెం జీసీ -1, జీసీ -2, ఏకం టెంపుల్‌లో తనిఖీ చేస్తున్నారు ఐటీ అధికారులు. చెన్నయ్ మంగమ్ బాక్కమ్ కల్కీ బ్రాంచ్ లోనూ దాడులు కొనసాగుతున్నాయి.