విజయవాడలో ఓ యువతి హల్ చల్...మహేష్‌బాబు, మోడీ, జగన్ రావాలని పట్టు..!?

SMTV Desk 2019-10-16 15:21:46  

విజయవాడలో ఓ యువతి హల్ చల్ చేసింది.. స్థానిక రెవెన్యూ కాలనీలోని అగ్రిగోల్డ్ ఆఫీసు ప్రాంగణంలోని చెట్టు ఎక్కిన యువతి.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కోసం రావాల్సిందేనని.. ప్రధాని నరేంద్ర మోడీ తనతో మాట్లాడాలని.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా నా మొర ఆలకించాలంటూ హంగామా చేసింది. యువతి వింత ప్రవర్త చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు.. ఎక్కడ చెట్టుపై నుంచి దూకేస్తోందోనని దించే ప్రయత్నాలు చేశారు.

అయితే.. చెట్టుపై ఉన్న యువతి వీడియో తీస్తుండగా చెట్టు కొమ్మలు విరిచి వారి పైకి విసిరేసిన ఆమె.. చెట్టు పైనుంచి దించేందుకు ప్రయత్నం చేసేందుకు యత్నంచిన వారిపై కూడా దాడికి పాల్పడింది. ఇక, స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఆ యువతికి కిందకు దూకినా, పడిపోయినా ప్రాణాపాయం లేకుండా చెట్టు కింద వలను ఏర్పాటు చేశారు.. అనంతరం నిచ్చెన సహాయంతో పైకి వెళ్లి.. నచ్చజెప్పి ఆమెను కిందకు తీసుకొచ్చారు. అసలు విషయం ఆ తర్వాత తెలిసి షాక్ తిన్నారు.. ఆమె పేరు అనిత కాగా.. ఆమె కోల్‌కతా నుంచి వచ్చింనట్టు గుర్తించారు. అయితే, ఆమెకు మతిస్థిమితం లేదని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు.