అల్లు అరవింద్ కు ఛాన్స్ ఇవ్వట్లేదా..!

SMTV Desk 2019-10-16 15:21:01  

పదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఖైది నంబర్ 150తో సూపర్ హిట్ కొట్టారు. కోలీవుడ్ హిట్ మూవీ కత్తి రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను వి.వి.వినాయక్ డైరెక్ట్ చేశారు. చిరు 150వ సినిమాతో కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించి నిర్మాతగా కొత్త స్టెప్ వేశాడు రాం చరణ్. ఇక 151వ సినిమాగా వచ్చిన సైరా సినిమా కూడా రాం చరణ్ నిర్మాణంలోనే తెరకెక్కింది. చిరంజీవి మెగాస్టార్ గా నిలదొక్కుకోవడంలో అల్లు అరవింద్ సపోర్ట్ అందరికి తెలిసిందే.

చిరంజీవితో ఎన్నో సినిమాలు తీసి హిట్ అందుకున్నారు అల్లు అరవింద్. అయితే చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఆయనతో సినిమా తీద్దామని అనుకుంటే మాత్రం అసలు వర్క్ అవుట్ అవట్లేదు. మామకు ఛాన్స్ ఇవ్వకుండా అల్లుడు రాం చరణే చిరంజీవితో వరుస సినిమాలు చేస్తున్నాడు. సైరానే కాదు ఆ తర్వాత వస్తున్న కొరటాల శివ సినిమాను కూడా చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ నిర్మాణంలో చిరంజీవి సినిమా కోసం ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి అది ఎప్పుడు కుదురుతుందో చూడాలి.