బడాబాబులే టార్గెట్.... అందమైన అమ్మాయిల ఎర!!

SMTV Desk 2019-10-14 15:24:40  

మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ బాగోతాన్ని మరువక ముందే ఢిల్లీలో ఐదు ముఠాలు కొందరు డబ్బున్న వ్యక్తులు టార్గెట్ గా అందమైన అమ్మాయిలను ఎరగా వేసి, డబ్బు గుంజిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ డాక్టర్ ఫిర్యాదుతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, డాక్టర్ వద్దకు 25 ఏళ్ల మహిళ చికిత్స నిమిత్తం వచ్చింది.

అతనితో స్నేహంగా ఉంటూ పలుమార్లు కలిసింది. ఆపై ఓ రోజు తనకు తీవ్ర అనారోగ్యంగా ఉందని, ఇంటికి రావాలని కోరి, ఇంటికి వచ్చిన డాక్టర్ తో శారీరకంగా కలిసి, మొత్తం వ్యవహారాన్ని రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరించింది. ఆపై వాటిని చూపించి, రూ. 20 లక్షల వరకూ ఈ ముఠా వసూలు చేసింది.

ఈ డాక్టర్ తో పాటు పలువురు బిల్డర్లు, హోటల్ యజమానులు, నగల వ్యాపారులు, న్యాయవాదులను మొత్తం ఐదు ముఠాలు ఇదే విధమైన హనీ ట్రాప్ లో పడేసి, కోట్ల రూపాయలు గుంజాయి. కొందరి నుంచి డెబిట్ కార్డులు, వాటి పాస్ వర్డ్ లను సైతం ఈ ముఠా తీసుకుందని పోలీసులు తేల్చారు.

అమ్మాయిలను పంపించి, బెడ్ రూమ్ దృశ్యాలను వీడియో తీయడమే వీరి పనని, ఇందులో జహంగీర్ గ్యాంగ్ కీలకమని, దీంతో పాటు మిట్టూ ముఠా, పర్మిందర్, రోహిత్ గ్యాంగ్, ముఖేష్ ముఠాలకు ప్రమేయముందని అన్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు ఫిర్యాదు చేశారని, కేసులన్నీ విచారిస్తున్నామని తెలిపారు. కీలకమైన ముఠా నాయకుడు జహంగీర్ అలియాస్ షేక్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని అన్నారు.