చెర్రీకి చిరు ముద్దులు..

SMTV Desk 2019-10-02 15:26:52  

ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు రిలీజ్ అయిన సైరా చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి షోతోనే సూపర్ డూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. సినిమా అత్యద్భుతంగా ఉందంటూ మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ ద్వారా రామ్ చరణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ బాస్ బస్టర్ కు ధన్యవాదాలు నాన్నా అని తన తండ్రికి థ్యాంక్స్ చెప్పాడు. తన తండ్రి తనను ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేశాడు.ఇపుడు ఈ పిక్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది ..