'సైరా' పరుగులు పెట్టేలా చేసింది ఆయనేనా??

SMTV Desk 2019-10-02 15:26:18  

సైరా నర్సింహారెడ్డి .... ఇప్పుడు తెలుగునాట ఏ సినీ అభిమానిని కదిపినా ఈ మాటే!! ఎంతో క్రేజ్ తో దసరా కానుకగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సైరా , అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దసరా సెలవులు ఉండడం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అదనపు షోలను వేసేందుకు పర్మిషన్ ఇవ్వడంతో సైరా తొలి వారంలోనే భారీ వసూళ్లను సొంతం చేసుకునే దిశగా పరుగులు పెడుతోంది.మొదట ప్రభుత్వం అదనపు షోలను వేసుకునేందుకు అనుమతి ఇవ్వడానికి నిరాకరిస్తుందనుకున్నారు.కానీ జగన్ ప్రభుత్వం ఊహించని రీతిలో అదనపు షోలకు పచ్చ జెండా ఊపింది.

సినిమా విడుదలవ్వక ముందు నుంచీ మెగా ఫ్యామిలీ సైరా అదనపు షోల కోసం చాలా ప్రయత్నించినట్టు సమాచారం. సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్స్,ఇంటర్వ్యూలు అన్నీ సాక్షి టీవీకి ఇచ్చి సీఎం జగన్ ను ఒప్పించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. కానీ జగన్ అప్పుడు అనుమతి ఇచ్చేనందుకు ఆసక్తి చూపలేదట. చివరికి ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన మాజీ జర్నలిస్ట్ కన్నబాబు జోక్యం చేసుకోవడంతో సైరా అదనపు షోలకు జగన్ ను ఒప్పించగలిగారు.సర్కార్ అనుమతి ఇవ్వడంతో అటు
చిరు అభిమానులు ,ఇటు మెగా ఫ్యామిలీ ఖుషీగా ఉన్నారు.