'సైరా'కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

SMTV Desk 2019-10-01 15:13:25  

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం సైరా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సైరా చిత్రాన్ని తొలుత బయోపిక్ అన్నారని, ఆ తర్వాత కాదంటున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... సినిమాను చూడాలా? వద్దా? అనేది ప్రేక్షకుల అభీష్టంపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించింది. సినిమాను సినిమాలాగే చూడాలని చెప్పింది.. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని... విడుదలకు ఒక రోజు ముందు సినిమాను ఆపలేమని తెలిపింది. హైకోర్టు తీర్పుతో మెగా అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. రేపు సైరా చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది.