తొలి టెస్టు మ్యాచ్‌కి భారత తుది జట్టు...పంత్‌పై వేటు

SMTV Desk 2019-10-01 15:12:21  

రేపు విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్‌కి భారత తుది జట్టుని బీసీసీఐ తాజాగా ప్రకటించింది. వికెట్ కీపర్‌ రిషబ్ పంత్‌పై వేటు వేసిన టీమిండియా మేనేజ్‌మెంట్.. కీపర్‌గా సాహాకి అవకాశమిచ్చింది. ఓపెనర్‌‌గా రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఆడనుండగా.. మిడిలార్డర్‌లో హనుమ విహారి చోటు దక్కించుకున్నాడు. సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలకి మరో అవకాశం దక్కగా.. గాయపడిన జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్‌కి తుది జట్టులో ఛాన్స్ దక్కలేదు.
వైజాగ్ టెస్టుకి భారత్ జట్టు ఇదే: విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, సాహా (వికెట్ కీపర్), ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ.