నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేయాలి .. కొనసాగుతున్న రచ్చ

SMTV Desk 2019-10-01 15:09:40  

టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ మధ్య ఆసక్తి కలిగే చర్చ జరిగింది. టీం ఇండియా జట్టులో నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేయాలనే అంశంపై ఎంతో కాలంగా చర్చ జరుగుతోంది. ఐసీసీ ప్రపంచకప్‌కి ముందే దీనిపై క్లారిటీ వస్తుందని అంతా భావించారు. కానీ, ప్రపంచకప్ ముగిసిన తర్వాత కూడా ఈ విషయం ఓ కొలిక్కి రాలేదు. దానిపై హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో యువ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ గొప్పగా రాణిస్తున్నాడని, అయితే అతన్ని టీం ఇండియాలో నాలుగో స్థానంలో ఎందుకు తీసుకోవడం లేదని ఓ ట్వీట్ చేశాడు హర్భజన్ సింగ్. అయితే, ఆ ట్వీట్‌పై యువరాజ్ స్పందించాడు. యార్ నీకు ముందే చెప్పాను..! వాళ్లకి నెం.4 అవసరం లేదు.. టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉందని రిప్లై ఇచ్చాడు యువీ.