హైదరాబాద్ వర్షానికి నీటిలో కొట్టుకుపోయిన వృద్ధుడు .. వీడియో వైరల్

SMTV Desk 2019-10-01 15:09:06  

హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్‌ వరద నీటిలో ఓ వృద్ధుడు కొట్టుకెళ్లిపోయాడు. ద్విచక్ర వాహనాన్ని పట్టుకునే క్రమంలో అదుపు తప్పి వరదలో కొట్టుకుపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.