రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యానికి గురిచేశాయి

SMTV Desk 2019-10-01 15:07:44  

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాసారు. గత నాలుగు నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని, ప్రభుత్వం ఉపాధి హామీ పనుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని లేఖ లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం జీవనోపాధిని దెబ్బతీస్తుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. పనులు చేసేవారికి బిల్లులు ఇవ్వడంలేదని, కూలీలకు సకాలంలో వేతనాలు లేవని మండిపడ్డారు.

వేతనాల విషయం లో ఉపాధి హామీ కౌన్సిల్ సిబ్బంది అధికారులను, మంత్రిని కలిసినప్పటికీ ఫలితం లేకుండాపోయిందని అన్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలని ,కూలీలా జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. రద్దులు ,కూల్చివేతలు,నిలిపివేతలు వంటి చర్యలతో ప్రభుత్వశైలి వివాదాస్పదంగా మారిందని అన్నారు. ఇప్పటికైనా స్పందించి నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేసారు.