దోమకాటుకు ఎయిర్టెల్ ఇన్సురెన్స్ మందు

SMTV Desk 2019-09-26 18:04:14  

ఇప్పటివరకు మనం చాలా రకాల ఇన్సూరెన్స్ పాలసీలను చూసి ఉంటాం కానీ ఇప్పుడు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన ఇన్సూరెన్స్ మాత్రం కొంచం భిన్నంగా ఉంది. ఈ మధ్య దోమకాటు చాలా మందిని భయపెడుతూ, బాధపెడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎయిర్‌టెల్ వినూత్నమైన ఇన్సురెన్స్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఈ పాలసీ పేరు మస్కిటో డిసీస్ ప్రొటెక్షన్ పాలసీ. ఈ పాలసీ ద్వారా దోమల వల్ల వచ్చే ‘డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా, జపనీస్ ఎన్సెఫాలటిస్, కాలా అజర్, లింఫటిక్ ఫిలేరియాసిస్, జికా వైరస్’ వంటి ఏడురకాల వ్యాధులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తోంది. దీనికోసం ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ నుంచి సంవత్సరానికి 99 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి ఈఆర్‌జీవోతో ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ జట్టు కట్టింది. సీజనల్ వ్యాధుల వల్ల ఉద్యోగాలకు వెళ్లలేక జీతాలు కోల్పోయేవాళ్లు చాలా మంది ఉంటారని అలాంటి వారికి ఈ పథకం ఉపయోగంగా ఉంటుందని ఎయిర్‌‌టెల్ ప్రతినిధులు తెలిపారు.