'వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర'గా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం..

SMTV Desk 2019-09-26 17:55:37  

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరో కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథక ఉదేశ్యం ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించడం. ఈ పథకానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర గా పేరు పెట్టింది. దీనికి సంబంధించిన విధివిధానాలు కూడా ఇప్పటికే వెలువడ్డాయి. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరుగుతోంది. ఈ పథకం గురించి అమరావతిలో మీడియా తో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ... ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లను కలిగి ఉండి, వాటిని డ్రైవింగ్‌ చేసుకునే వారికి ప్రభుత్వం రూ.10వేలు సహాయం చేయనుందనీ, ఈ పథకానికి భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయనీ, ఇప్పటి వరకు 1.85 లక్షల మంది డ్రైవర్లు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. వచ్చే నెల 4వ తేదీన ఆటో డ్రైవర్లకు ఆర్ధిక సాయం అందించే పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించి, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.