గడ్డం పెంచు .. హిట్ కొట్టు .. టాలీవుడ్ నయా ట్రెండ్

SMTV Desk 2019-09-24 15:05:55  

హీరో అంటే క్లిన్ షేవ్ తో ఒతైన జుత్తు తో పొడుగ్గా అందంగా ఉండాలన్నది ఒకప్పటి మాట ఇప్పుడు ట్రెండు మారింది. "ఏ ఎండకా గొడుగు అన్నటుగా" హీరోలు కూడా ట్రెండు కు తగ్గట్టు మారుతున్నారు. ఈ ట్రెండ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాస్ లుక్ గురించే. హీరోలు మాస్ లుక్ కనిపించాలంటే పక్క గడ్డం ఉండాల్సిందే.. ఇటీవల కాలంలో మన హీరోలకు గడ్డం సెంటిమెంట్ అయ్యింది. గడ్డం పెంచి టాలీవుడ్ హీరోలు మంచి సక్సెస్ లు అందుకుంటున్నారు. వారిలో మెగా హీరోలు ఎక్కువ .. రంగస్థలం సినిమాకోసం గడ్డం పెంచిన రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత ఎప్పటి నుంచో హిట్టు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన సాయి ధరమ్ తేజ్ కూడా చిత్రలహరి సినిమా కోసం గడ్డం పెంచి సక్సెస్ అందుకున్నాడు.

ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తోలి ప్రేమ సినిమాలో గడ్డం తో కనిపించడు. ఈ సినిమా మంచి క్లాస్ హిట్టు కోటింది. ఆ తర్వాత గద్దలకొండ గణేష్ సినిమా కోసం గడ్డం పెంచి ఊర మాస్ లుక్ లో కనిపించి అదరగొట్టాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్టు దిశగా పరుగులు పెడుతుంది. క్రేజీ హీరో విజయ్ దేవర కొండ అర్జున్ రెడ్డి సినిమాలో గండం తో కనిపించి సూపెర్ హిట్ అందుకున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మహర్షి సినిమాలో కొత్తగా గడ్డం తో కనిపించాడు. ఎప్పుడు చిన్న పిల్లాడిలా కనిపించే మహేష్ గడ్డం తో మాస్ లుక్ ట్రై చేసాడు. మరో వైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నాన్నకు ప్రేమతో సినిమా కోసం స్టైల్ గా కనిపించడానికి గడ్డం తో అలరించిన విషయం తెలిసిందే.. ఇక సైరా నరసింహా రెడ్డి కోసం చిరు కూడా గడ్డం పెంచాడు. ఇలా మన హీరోలకు గడ్డం హిట్టు కొట్టడానికి సెంటిమెంటుగా మారింది. ఇప్పడు యూత్ కూడా ఈ గడ్డం సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. తమ అభిమాన హీరోల మాదిరిగా రక రకాలుగా గడ్డం పెంచి కొత్తలుక్ ను ట్రై చేస్తున్నారు