జ్యోతి సురేఖకు భారీ నజరానా

SMTV Desk 2017-08-31 17:47:07  Archery Jyothi Surekha, Arjuna award, Archery, AP Chief Minister,

అమరావతి, ఆగస్ట్ 31: క్రీడాకారుల వెన్నంటే ఉండి వారికి తగు ప్రోత్సాహాన్ని అందించే ఏపీ ముఖ్యమంత్రి తాజాగా విలు విద్యలో దూసుకుపోతున్న అర్జున అవార్డు గ్రహిత వెన్నం జ్యోతి సురేఖకి భారీ నజరానాను ప్రకటించారు. ఇటీవలే రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌ కోవింద్ చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్న ఆమె నేడు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసింది. ఈ నేపధ్యంలో సీఎం ఆమెను అభినందించి, విజ‌య‌వాడ‌లో 500 చ‌ద‌ర‌పు గ‌జాల స్థ‌లం, కోటి రూపాయ‌ల న‌గ‌దును ప్రోత్సాహ‌కంగా ఇస్తామ‌ని వెల్లడించారు. అంతేకాకుండా ఆమె పేరును ప్రభుత్వోద్యోగానికి సిఫారసు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.