నర్సుకు మత్తు మందిచ్చి డాక్టర్, కాంపౌండర్... ఛీ.. ఛీ

SMTV Desk 2019-09-24 15:02:52  

రాజస్థాన్‌లో రాష్ట్రం, బర్మర్ జిల్లాలోని ఓ పట్టణంలో ఒక హాస్పిటల్ లో అశోక్ అనే వ్యక్తి కాంపౌండర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అశోక్ ఆస్పత్రిలో తనతో పనిచేసే నర్సులపై తరుచూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. అతడికి డాక్టర్ల సపోర్ట్ ఉండటంతో బాధితులు ఈ విషయం బయటకు చెప్పేవారు కాదు. కొద్ది నెలల క్రితం అదే హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న వివాహితపై అతడి కన్ను పడింది. ఓ రోజు నైట్ డ్యూటీలో ఉన్న ఆమెతో మాటలు కలిపి జ్యూస్ ఇచ్చాడు. అది తాగిన ఆమె మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత ఆమెను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి వీడియో తీశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతానని బెదిరించి అనేకసార్లు హాస్పిటల్ లోనే ఆమెపై అత్యాచారం చేశాడు. కొద్దిరోజుల తర్వాత ఆ వీడియో డాక్టర్ సురేంద్ర మహర్షికి చేరింది. అతడు కూడా బాధితురాలిని బెదిరించి అత్యాచారం చేశాడు.ఈ విషయం తెలుసుకున్న సురేంద్ర సోదరుడు కూడా తరచూ ఆస్పత్రికి వస్తూ నర్సుపై లైంగిక దాడికి పాల్పడేవాడు. రోగులకు వైద్యం చేసి వారి ప్రాణాలు నిలబెట్టే గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న డాక్టర్ నీచుడిలా ప్రవర్తించాడు. దాదాపు సంవత్సరం పాటు ఆ ముగ్గురి కామ దాహానికి బాధితురాలు బలైపోయింది. వారి బారి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ధైర్యం చేసిన బాధితురాలు ఆగస్టు 16న డాక్టర్ సురేంద్రను కలిసి వీడియో డిలీట్ చేయాలని, తనపై వేధింపులను ఆపేయాలని కోరింది. దీంతో తాను చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తానని ఆమెను బెదిరించాడు. దీంతో బాధితురాలు
తనపై జరుగుతున్న దారుణాన్ని కుటుంబసభ్యులకు వివరించింది. వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ముగ్గరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. రెండ్రోజుల క్రితమే వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.