తీన్మార్ మల్లన్న ను అరెస్ట్ చేయనున్నారా ?

SMTV Desk 2019-09-24 15:02:16  

వీ6 ప్రసారం చేసే తీన్మార్ వార్తల్లో ఒకప్పుడు తీన్మార్ మల్లన్నగా ఫేమస్ అయిన నవీన్ కుమార్ ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేయనున్నారా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో రాజకీయాల్లో పోటీ పడి ఓడిపోయాడు. ఆ సమయంలో వీ6ను వదిలేసి ఆ తర్వాత 10 టీవీలో చేరాడు. కేసీఆర్ కు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేశాడు. ఆ తర్వాత 10 టీవీని టీవీ9 సంస్థ యాజమాన్యం చేజిక్కించుకొని మల్లన్నను సాగనంపేసిందని మీడియా వర్గాల్లో టాక్. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పోస్ట్ చేస్తున్న వీడియోలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైందంటున్నారు.

ఒక పాత కేసును తవ్వి తీసి ఆ కేసులో మల్లన్నను జైలుకు పంపేలా ప్లాన్ చేశారనే ప్రచారం మొదలయ్యింది. ఈ క్రమంలోనే మల్లన్న ఇంటి చుట్టూ భారీ ఎత్తున పోలీసు బలగాల్ని దింపినట్లుగా రెండ్రోజుల నుండి ప్రచారం జరుగుతోంది. నిజానికి వీ6లో మానేసిన తర్వాత కూడా ఆయన్ను తీన్మార్ మల్లన్నగా గుర్తింపు పొందటం.. ఆయన అప్పుడప్పుడు తన మాటల్లో ఆ పేరును ప్రస్తావించటంతో.. ఆ పేరును వాడుకోవద్దని సదరు మీడియా సంస్థ ఆదేశించింది. అప్పటి నుంచి తన పేరును తీన్మార్ మల్లన్నగా చెప్పుకోవటం మానేశారు. కానీ ప్రజలు మాత్రం ఆయన్ను మల్లన్నగానే ప్రస్తావిస్తున్నారు.