ఇంటర్నెట్ వినియోగంలో దిగజారిన భారత్‌ స్థానం

SMTV Desk 2019-09-24 15:00:47  

ఇంటర్నెట్ వినియోగంలో దూసుకుపోతున్నామని సంబరపడిపోతున్న భారతీయులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. మొబైల్ ఇంటర్నెట్ వేగంలో భారత్ అట్టడుగున ఉండడం విశేషం. ఆగస్టు నెలకుగాను మొబైల్ ఇంటర్నెట్ వేగంపై మొత్తం 145 దేశాల్లో జరిగిన అధ్యయనంలో మనది 131 స్థానంగా తేలింది. ఈ మేరకు ఊక్లాకు చెందిన స్పీడ్‌ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ వెల్లడించింది. ఈ జాబితాలో దక్షిణ కొరియా సగటున 111 ఎంబీపీఎస్ వేగంతో అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా నిలిచింది. ఈ జాబితాలో అమెరికా టాప్-10లో చోటు దక్కించుకోలేకపోవడం విశేషం. భారత్ పేరు తొలి వంద స్థానాల్లోనూ కనిపించలేదు. సగటున 10.65 ఎంబీపీఎస్ వేగంతో 131 స్థానంలో నిలిచింది. భారత్ పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్థాన్, నేపాల్‌లు ఇంటర్నెట్ వేగంలో మనకంటే మెరుగ్గా ఉండడం విశేషం.