ఢిల్లీలో కేజీ ఉల్లిగడ్డ ధర రూ. 70

SMTV Desk 2019-09-24 15:00:05  

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. ఢిల్లీలో కేజీ ఉల్లిగడ్డ డెబ్బై రూపాయల పైనే పలుకుతుంది. అయితే కొనకుండానే సామాన్యుడికి కంటతడి పెట్టిస్తున్న ఉల్లిపాయలను సబ్సిడీపై అందించాలని నిర్ణయించింది ఢిల్లీ సర్కార్‌. అన్ని ప్రాంతాల్లో మొబైల్ వ్యాన్ల ద్వారా ఉల్లిని కిలో 24 రూపాయల చొప్పున విక్రయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారాయన. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వరదలతో ఢిల్లీ మార్కెట్ కు ఉల్లి సరఫరా నిలిచిపోవడంతో ధరలకు రెక్కలొచ్చాయి.