అదనపు నిధుల కోసం 'ఓయో ' భారీ ప్రణాళిక

SMTV Desk 2019-09-24 14:58:50  

అదనపు నిధుల సమీకరణపై ఓయో దృష్టి సారించింది. దీనిలో భాగంగా 50 మిలియన్‌ డాలర్ల నుంచి బిలియన్‌ డాలర్ల వరకు సమీకరించాలని దీని మాతృ సంస్థ ఓరవెల్‌ స్టన్‌ ఓవర్‌ ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో సాఫ్ట్‌ బ్యాంక్‌ గ్రూపు నిధులను పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓయో మార్కెట్‌ విలువను 18.5 బిలియన్‌ డాలర్ల నుంచి 15 బిలియన్‌ డాలర్ల మధ్య నిర్ణయించే అవకాశం ఉంది. రితీష్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని ఈ కంపెనీ వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా విలాసవంతమైన ఫైవ్‌స్టార్‌ హోటళ్లను నిర్వహించాలని భావిస్తోంది. ఓయో భారీగా విలువను పెంచుకోనేందుకు కార్ఫొరేట్‌ పునర్‌ వ్యవస్థీకరణ చేస్తోంది. కొత్తగా పలు అనుబంధ సంస్థలను నెలకొల్సుతోంది. ఇటీవల సంస్థ విలువను 10 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేసిన సమయంలో అగర్వాల్‌ 1.5 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేశారు. ఈ బైబ్యాక్‌ను నీనీఐ ఆమోదించింది. దీంతోపాటు అగర్వాల్‌ ఓయో ఇండియా విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నుంచి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా మారిపోయారు. ఆయన ప్రపంచ వ్యాప్తంగా విస్తరణపై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నారు.