బాబుల్‌ సుప్రియోపై జరిగిన దాడికి నిరసనగా ఏబీవీపీ ర్యాలీ..కార్యకర్తలకు గాయాలు

SMTV Desk 2019-09-23 17:58:14  

కోల్‌కతాలో ఏబీవీపీ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ వద్ద కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియోపై జరిగిన దాడికి నిరసనగా ఆందోళనకు దిగింది ఏబీవీపీ. అయితే పోలీసులు కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో ఇరువురు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పటంతో నిరసనకారులను అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ క్రమంలో పలువురు ఏబీవీపీ కార్యకర్తలకు స్వల్పగాయాలయ్యాయి.