బాహుబలిని మించి సైరా ఉంటె.. సైరాను మించేలా ఆర్ఆర్ఆర్???

SMTV Desk 2019-09-23 17:57:40  

టాలీవుడ్ చరిత్రలో ఫెయిల్యూర్ లేని విధంగా సక్సెస్ లో దూసుకుపోతుం దర్శకుడు రాజమౌళి. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటికూడా ఫెయిల్యూర్ లేదు. సినిమాను ఎలా తీస్తే జనాలకు ఎక్కుతుందో.. ఎలా తీస్తే డబ్బులు వస్తాయో దర్శకుడు రాజమౌళికి బాగా తెలుసు. అంతబాగా తెలుసు కాబట్టే రాజమౌళి భారీ సినిమాలు తీయగలుగుతున్నారు. బాహుబలి సినిమాతో తన సత్తా ఏపాటిదో నిరూపించారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి ప్రస్థానం మరోవిధంగా ఉంటుందని అంటున్నారు. బాహుబలి సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. ఈ సినిమా కోసం దాదాపు 2200 విజువల్ ఎఫెక్ట్స్ ను వినియోగించారు. అన్ని ఎఫెక్ట్స్ ను వినియోగించినా.. దానికి తగ్గట్టుగా ఎమోషన్స్ ను క్యారీ చేయడం చాలా కష్టం. ఎమోషన్ క్యారీ కాకపోతే.. సినిమా ఫెయిల్ అవుతుంది. సైరా కోసం ఏకంగా 3300 విజువల్ ఎఫెక్ట్స్ వినియోగించారు. సైరాలో ఆ ఎమోషన్స్ చూపడం కుదరలేదు. కానీ, సినిమాలో మాత్రం తప్పకుండా ఎమోషన్స్ ను క్యారీ చేసి ఉంటారని రాజమౌళి పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో ఒకరిని మించి మరొకరు సినిమాలు తీస్తున్నారని రాజమౌళి చెప్పారు. అంటే బాహుబలిని మించి సైరా ఉంటె.. సైరాను మించేలా ఆర్ఆర్ఆర్ వస్తుంది అని చెప్పడమే రాజమౌళి ఉద్దేశమా.. ఏమో చూద్దాం.