హుజూర్ నగర్ ఉపఎన్నిక లో తెరాస గట్టెక్కుతదా

SMTV Desk 2019-09-23 17:52:26  

హుజూర్ నగర్ ఉపఎన్నిక సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. మరే ఎన్నికలూ లేకపోవడంతో పార్టీలన్నీ ఈ ఉపఎన్నిక మీదే సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. సొంత స్థానాన్ని మళ్లీ గెలుచుకోవాలని కాంగ్రెస్ సంసిద్దమవుతుంటే మూడుసార్లుగా ఎదురైన పరాభవాన్ని ఈసారైనా విజయంతో తప్పించుకోవాలని తెరాస ఉవ్విళ్ళూరుతోంది.

హుజూర్ నగర్ నుండి 2009, 14, 18 ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందుతూ వస్తున్నారు. ఈ మూడు దఫాల్లో అభ్యర్థులను మారుస్తూ వచ్చినా గెలవలేకపోయిన తెరాస ఈసారి మాత్రం 2018లో ఓడిన సైదిరెడ్డికే టికెట్ ఇచ్చి బరిలోకి దూకుతోంది. మంత్రులను ఇన్ఛార్జిలుగా నియమించి ఎన్నికల తతంగాన్ని మొదలుపెడుతోంది.

మరోవైపు కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ సతీమణి పద్మావతికి టికెట్ ఇచ్చి ఈసారి కూడా గెలుస్తామనే ధీమాలో ఉంది. భాజాపా కూడా ఈ స్థానం కోసం గట్టిగానే ట్రై చేస్తున్నా ప్రధాన పోటీ మాత్రం తెరాస, కాంగ్రెస్ పార్టీల నడుమే నెలకొంది. మరి ఈ పోటీలో ఎవరు నెగ్గుతారో చూడాలి.