గోదావరి బోటు వెనకాల పెద్దల హస్తం

SMTV Desk 2019-09-23 11:13:39  

ఇటీవలే గోదావరిలో బోటు ప్రమాదం జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఆ ప్రమాదంలో చాలా మంది మృత్యువాత పడ్డారు. కాగా కొందరి మృతదేహాలు ఇప్పటికి కూడా కనుక్కోలేకపోతున్నారు. అయితే ఈ ప్రమాదంలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదం వెనకాల చాలా పెద్ద స్కాం ఉన్నదని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాగా ఈ ప్రమాదం కోసమని ఆదివారం నాడు ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు కొన్ని సంచలన వాఖ్యలు చేశారు. ఈమేరకు మాట్లాడిన ఆయన… గోదావరి బోటు వెనకాల పెద్దల హస్తం ఉందని అంటున్నారు.

అది నిరూపితం కావాలంటే మాత్రం బోట్‌ డ్రైవర్‌ కాల్‌ డేటా బయటకు తీయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలా చేస్తేనే నిజానిజాలు అన్ని బయటకు వస్తాయని వెల్లడించారు. కాగా ఈ ప్రమాద స్కాం నుండి చాలా మంది పెద్ద నేతలు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో రివర్స్ టెండరింగ్ పద్దతిలోనే, రివర్స్ ఎక్సమింగ్ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇకపోతే పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తో స్నేహం కోసమని రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ని నాశనం చేయొద్దని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి సూచించారు.