పవర్ స్టార్ , మహేష్ బాబు తర్వాత ఆ లిస్ట్ లోకి ప్రభాస్

SMTV Desk 2019-09-23 11:13:01  

తెలుగు సినీ పరిశ్రమ నుంచి బాహుబలి రెండు సినిమాలు తర్వాత మళ్ళీ ఆస్థాయిలో భారతదేశ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన చిత్రం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా “సాహో” సినిమాయే అని చెప్పాలి.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల సమయంలో ఏర్పడిన హైప్ తో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది.కానీ ఊహించిన స్థాయి ఫలితాన్ని అయితే అందుకోలేకపోయింది అన్న మాట వాస్తవం.

దీనితో ఇప్పుడు “సాహో” సినిమా టాలీవుడ్ లోని భారీ నష్టాలను మిగిలిచ్చిన చిత్రాల జాబితాలోకి చేరనుంది అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.సాహో కు ఇప్పుడు ఎలా లేదన్నా తెలుగులో 60 కోట్లకు పైగానే నష్టాలు వచ్చేలా ఉన్నాయని తెలుస్తుంది.ఇప్పటికి వరకు ఆ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు నటించిన సినిమాలు టాప్ లో ఉండగా వాటి తర్వాత స్థానం సాహో దక్కించుకునేలా ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.మొత్తానికి సాహో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గానే మిగిలిపోవాల్సి వస్తుంది.