పురుషుల కంటే స్త్రీలకే శృంగారంపై ఆసక్తి

SMTV Desk 2019-09-23 11:12:16  

మానవ జీవితంలో శృంగారానికి ప్రత్యేక స్థానం ఉంది.. స్త్రీ, పురుషుల సంభోగంలో ఎవరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే బేదం ఏమీ లేదు. శృంగార సాగరంలో తేలిపోవాలని... ఆ మధురానుభూతిని ఆస్వాదించాలను తహతహలాడుతుంటారు. అయితే, దానిపై ఎవరికి ఎక్కువ మక్కువ.. ఎవరూ ఆసక్తి చూపరనే చర్చ మాత్రం సాగుతూనే ఉంది. తాజాగా ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఓ సర్వే ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. ముఖ్యంగా హాలీడేస్‌లో మీ ఓటు దేనికి? హాలీడేస్‌ను వివిధ ప్రాంతాలను చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తారా? లేక శృంగార సాగరంలో మునిగితేలుతారా? అనే పాయింట్‌తో సర్వే చేసింది ఆసీస్‌లోని ప్రముఖ ట్రావెల్ ప్లాట్‌ఫామ్. ఈ సర్వేలో ఆస్ట్రేలియాకు చెందిన వెయ్యి మంది అభిప్రాయాలను సేకరించింది.

అయితే ఈ సర్వేలో 57 శాతం మంది సెక్స్ కంటే హాలీడేస్‌ను ఎంజాయ్ చేయడానికే మొగ్గు చూపగా... 25 శాతం సెక్స్ కావాలని కోరుకున్నారు. ఇదే సమయంలో 7 శాతం మంది ఎక్సర్‌సైజ్‌లు, బిగ్ నైట్ ఔట్‌లపై 6 శాతం ఆసక్తి చూపుతున్నట్టు సర్వే చెబుతోంది. మరోవైపు ఇక్కడే మరో ఆసక్తికరమైన అంశం బయటపడింది.. ఈ సర్వేలో పురుషుల కంటే స్త్రీలే శృంగారంపై ఆసక్తి చూపించినట్టు బహిర్గతమైంది. ఎందుకంటే మహిళలు 69 శాతం సెక్స్‌కావాలని కోరుకోగా... పురుషుల్లో కేవలం 45 శాతం మందే శృంగారానికి ఓటు వేశారు.. ఇక, హాలీడేస్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారిలో 55 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారి శాతం 64 ఉండగా... 18 నుంచి 24 మధ్య వయసున్న వారిలో సెక్స్‌పై ఆసక్తి 46 శాతం ఉన్నట్టు ఆ సర్వే చెబుతోంది. 45 నుంచి 54 ఏళ్ల వయసున్న వాళ్లే ఎక్కువ శాతం సెక్స్‌పై ఆసక్తి చూపడం మరీ గమనించాల్సిన విషయం. సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండే 18 నుంచి 24 ఏళ్ల వయసున్న వాళ్లు కేవలం 20 శాతం మంది మాత్రమే ఉన్నారని పేర్కొంది