భార్య లేని సమయంలో మరదలిపై అఘాయిత్యం!!

SMTV Desk 2019-09-23 11:10:45  

బిహార్‌లోని భగల్‌పూర్ పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఇల్లాలికి సాయం చేయడానికి వచ్చిన మరదలిపై అఘాయిత్యానికి పాల్పడబోయాడు ఓ కామాంధుడు. భార్యకు సపర్యలు చేయడానికి వచ్చిన మరదలిని కోరిక తీర్చాలంటూ వేధించడం మొదలుపెట్టాడు ఆ దుర్మార్గుడు. ఎన్నోసార్లు ఇంట్లోనే అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించగా భార్య అడ్డుకుంది. శనివారం అతడి భార్య ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లగా ఇంట్లో ఆమె చెల్లి ఒంటరిగా ఉంది. దీంతో ఆ వ్యక్తి తలుపులకు గడియపెట్టి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. వదిలేయాలని బాధితురాలు ప్రాథేయపడినా వినలేదు. అదే సమయంలో తిరిగొచ్చిన ఆమె అక్క ఇంట్లో నుంచి వస్తున్న కేకలు విని స్థానికులను అప్రమత్తం చేసింది. తలుపులు పగులగొట్టి భర్తను చితకబాదింది. పోలీసులకు ఫిర్యాదు చేసి భర్తను కటకటాల్లోకి నెట్టింది.