ప్రతీ దానికి ఒక హద్దు ఉంటుంది

SMTV Desk 2019-09-23 11:09:12  

సైరా నరసింహ రెడ్డి చిత్రం విషయం లో వివాదాలు తలెత్తుతున్నాయి. సినిమా కి సంబంధించి కథ విషయం లో, వారసుల కి డబ్బు చెల్లించాల్సిందిగా ఉయ్యాలా వాడ నరసింహారెడ్డి నాలుగోతరం వారసులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసారు. అయితే ఈ చిత్రం విషయం లో జనసైనికులు కొంత మేర ఆగ్రహం తోనే వున్నారు.

స్వాతంత్ర పోరాట సమయం లో పోరాడిన యోధుల చిత్రాలను నిర్మించడానికి కోట్లు చెల్లించాలని, బ్లాక్ మెయిల్ చేయలేదని తెలిపారు. బతికి ఉంటే మీ లాంటి స్వార్థపరులు వున్నందుకు నరసింహారెడ్డి కూడా భాదపడతారు అంటూ పొలిటికల్ సేన తెలిపింది. మెగా ఫ్యామిలీ చాల సున్నితం గా వ్యవహరిస్తది, వారి నేతి పైన ఎక్కి కూర్చుంటాం అంటే మెగా ఫామిలీ ఉరుకుంటుందేమో కానీ, తాము ఊరుకోము అన్నట్లుగా తెలిపారు. రాజకీయంగా వెనక వుంది నడిపేవాళ్లు ఎవరైనా ఉంటే చెప్పండి , ఈ చిత్రాన్ని ఆపాలంటే వాళ్ళ బాబులు దిగి రావాలి అని అన్నారు. సైరా చిత్రం విడుదలకి దగ్గర పడుతున్న కొద్దీ ఈ చిత్రం పై ఇలాంటి ఇబ్బందులు రావడం మెగా ఫ్యామిలీ ని కలవరపెడుతుంది చెప్పాలి.