ఏపీ సీఎం ని ఇబ్బంది పెడుతున్న వివేకా హత్య కేసు

SMTV Desk 2019-09-16 11:49:28  

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనను కొనసాగిస్తున్నాడు.

అయితే ఎన్నికల ముందు జగన్ బాబాయ్ వివేకా హత్య రాజకీయాలలో సంచలనం రేపింది. అది వైసీపీనే చేయించిందంటూ టీడీపీ ఆరోపణలు కూడా చేసింది. అయితే వివేక హత్యకు గురై చాలా రోజులు అవుతున్న పోలీసులు ఇప్పటికి ఆ హత్య కేసును చేధించలేకపోయారు. అయితే అప్పటి ప్రభుత్వం ఈ కేసును సిట్‌కు అప్పచెప్పింది. అయినా కూడా ఈ కేసు ఒక కొల్లిక్కి తీసుకురాలేకపోయారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసుకు సంబంధించి అసలు నిజాలను భయటపెట్టేందుకు 25 మంది సభ్యులతో కలిసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసారు. అయితే అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తున్నా సొంత బాబాయి కేసునే చేదించలేకపోతున్నారంటూ ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు నారా లోకేశ్, చంద్రబాబు నాయుడు సమయంవచ్చినప్పుడల్లా కేసు గురుంచి మాట్లాడుతూ వివేకా హత్య కేసును జగన్ సీబీఐకి ఎందుకు అప్పగించడంలేదో చెప్పాలని అడుగుతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి నిజాలు భయటపెట్టలేకపోవడంతో బాబాయ్ కేసు కాస్త అబ్బాయ్ మెడకు చుట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఈ విమర్శల నుంచి జగన్ తొందరగా గట్టెక్కాలంటే మాత్రం వీలైనంత త్వరగా కేసును ఓ కొలికి తీసుకురావడం బెటర్.