బిగ్ బాస్ లో డబల్ మీనింగ్ డైలాగ్

SMTV Desk 2019-09-16 11:48:50  

నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మేట్స్ తో దాదాపు నాలుగు చిన్న చిన్న టాస్క్ లు ఆడించాడు. శనివారం ఇచ్చిన సీరియస్ డోస్ ని తగ్గిచటానికి ఆదివారం నాగార్జున షో మొత్తాన్ని సరదా సరదాగా నడిపించాడు. ఇక ఇందులో ఒక టాస్క్ లో భాగంగా పునర్నవి -రాహుల్ కలిసి ఒక స్క్రిప్ట్ చేయాలనీ నాగ్ చెప్పాడు. పునర్నవిని ఎలాగైనా రీఛార్జ్ చేయటమే రాహుల్ యొక్క టాస్క్.

ఇందులో భాగంగా రాహుల్ కాఫీ షాప్ లో ఎదురుచూస్తుంటాడు. లోపలకి వచ్చిన పునర్నవి సీరియస్ గా రాహుల్ తో మాట్లాడుతుంది. ఆమెని ఇంప్రెస్స్ చేయటానికి రాహుల్ ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే పునర్నవి రియల్ గానే రాహుల్ మీద సీరియస్ అవుతున్నట్లే అనిపించింది. వాళ్ళ మధ్య సరిగ్గా నడుస్తున్న ప్రెజెంట్ ఇష్యూ కూడా దీనికి సంబంధించింది కావటంతో పునర్నవి ప్రశ్నలకి రాహుల్ సమాధానం ఇవ్వలేకపొతున్నాడు.

దీనితో తడబడుతున్న రాహుల్ ని చూసి నువ్వు ఎదో ఒకటి పునర్నవి ని రీచార్జి చేయమని నాగ్ చెప్పటంతో, రీచార్జి అవుతావా..? ఎంతకి అవుతావు..? అంటూ రాహుల్ మాట్లాడటం జరుగుతుంది. దీనితో పునర్నవి ఏమి మాట్లాడుతున్నావు, రీచార్జి అవుతావా..? ఎంతకి అవుతావు అని అడుగుతావేంటి అని సీరియస్ గా చెపుతుంది. అయితే మనకి రాత్రి టెలికాస్ట్ అయిన షోలో రాహుల్ మాట్లాడిన “ఎంతకి అవుతావు” అనే దానిని కట్ చేశారు. ఎందుకంటే అది డబల్ మీనింగ్ డైలాగ్ కిందకి వస్తుంది. కావాలంటే నిన్న ఉదయం విడుదల అయిన ప్రోమోస్ మనం చూస్తే అర్ధం అవుతుంది.