కథకు అది అవసరం కాబట్టి.... అలా నటించా!!

SMTV Desk 2019-09-13 13:13:34  

చిత్రలహరి , బ్రోచేవారెవరురా సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ నివేదా పేతురాజ్. ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో.. సినిమాలో నటిస్తోంది. కెరీర్ ఆరంభంలో సాంప్రదాయబద్ధమైన పాత్రలు చేసిన నివేద.. ప్రస్తుతం గ్లామరస్ పాత్రలకు ఓటేస్తోంది. దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

"గ్లామర్ విషయంలో పెద్దగా పట్టింపులు లేవు. గ్లామరస్‌గా నటించాలని లేదా నటించకూడదని నియమాలేం పెట్టుకోలేదు. కథకు అవసరమైతే గ్లామరస్‌గా కనిపించడం తప్పుకాదు. ప్రస్తుతం అల వైకుంఠపురములో.." సినిమాలో నటిస్తున్నా. అందులో చాలా గ్లామరస్‌గా కనిపించబోతున్నా. కథకు అది అవసరం కాబట్టి అలా నటించా. తమిళంలోనూ, తెలుగులోనూ ఇప్పటివరకు గ్లామరస్‌గా కనిపించే అవసరం రాలేద`ని నివేద తెలిపింది.