చాలా గ్యాప్ తర్వాత మళ్లీ అదే మాట!!

SMTV Desk 2019-09-13 13:08:43  

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ వరుస ట్వీట్లతో మరోసారి వార్తల్లో నిలిచారు. జనసేనాని పవన్ కల్యాణ్ ను తన దేవుడుగా ఎప్పుడూ చెప్పుకునే బండ్ల గణేశ్... మరోసారి తన స్వామి భక్తిని చాటుకున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పవన్ కల్యాణ్ అంటే తనకు ఎప్పుడూ ప్రాణమేనని ట్వీట్ చేశారు. తల్లిదండ్రులు, పవన్ కల్యాణ్ విషయంలో తాను ప్రతి రోజు శీల పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ ముగ్గురి విషయంలో వాదనలు అనవసరమని... నో మోర్ డిస్కషన్స్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.