పాశ్చాత్య సంస్కృతి వల్లే అనర్ధాలు

SMTV Desk 2017-06-03 18:31:58  rss, indresh kumar, westran culture, mumbai

ముంబాయి, జూన్ 3:పాశ్చాత సంస్కృతి అనుకరణ వల్లే సాంప్రదాయకమైన భారత్ అనర్ధాలు తలేత్తుతున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేత ఇంద్రేశ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా నేరాలు ఆ సంస్కృతి వల్లే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముంబాయిలో జరిగిన ఆర్ఎస్ ఎస్ కార్యకర్తల సమావేశంలోఆయన ప్రసంగించారు.అత్యాచారం, గృహహింస లాంటి అనర్ధాలకు పాశ్చాత్య సంస్కృతే కారణమని ఆరోపించారు.ఇస్లాం సంస్కృతి లోని తలాక్ అంశానికి కూడా ఆ సంస్కృతే కారణమని వివరించారు. ప్రేమ స్వచ్ఛమైనదే..కానీ పాశ్చాత్య సంస్కృతి దాన్ని ఓ ఫ్యాషన్ గా, బిజినెస్ గా మార్చిందని చెప్పారు. అత్యాచారాలు, విడాకుల వెనుక కూడా అదే కారణమని చేప్పారు. ప్రేమికుల రోజు ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారని అదే సంస్కృతి వల్ల తలాక్‌లు, అత్యాచారాలు, గృహహింస, గర్భంలోనే ఆడ శిశువును చంపేయడం వంటివి పెరిగిపోతున్నాయి’ అంటూ వివాదాస్పదంగా మాట్లాడారు. ఇంద్రేశ్‌ కుమార్‌ ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో బీఫ్‌ ఫెస్ట్‌ గురించి కూడా మాట్లాడారు. కొందరు వ్యక్తులు బీఫ్‌ ఫెస్ట్‌లో పాల్గొని దేశాన్ని అవమానాల పాలు చేస్తున్నారంటూ ఇంద్రేశ్‌ వ్యాఖ్యలు చేశారు