రవిబాబు హారర్ థ్రిల్లర్ సినిమా ఫస్టులుక్ రిలీజ్

SMTV Desk 2019-09-11 15:12:12  

నటుడిగా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించే రవిబాబు, దర్శకుడిగాను విభిన్నమైన చిత్రాలనే తెరకెక్కిస్తూ వస్తున్నాడు. మొదటి నుంచి కూడా ఆయన తన సినిమాల టైటిల్ అ అనే అక్షరంతో మొదలయ్యేలా చూసుకుంటూ వస్తున్నాడు. అలా ఆ మధ్య అదుగో అనే సినిమాతో కొత్త ప్రయోగం చేసిన ఆయన, తాజాగా ఆవిరి అనే సినిమా చేశాడు.

ఈ హారర్ థ్రిల్లర్ సినిమా నుంచి తాజాగా ఫస్టులుక్ పోస్టర్ ను వదిలాడు. గ్యాస్ స్టవ్ పై వున్న కుక్కర్ నుంచి ఆవిరి వస్తుండగా, కుక్కర్ పై భాగాన్ని ఓపెన్ చేసుకుని అందులో నుంచి భయపెడుతూ రెండు కళ్లు కనిపించేలా ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. ఆవిరి అనే టైటిల్ కి తగినట్టుగా వదిలిన ఈ ఫస్టులుక్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తించేలా వుంది. అంతా కొత్త వారితో రవిబాబు నిర్మించిన ఈ సినిమాకి, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. గతంలో అవును సినిమాతో విజయాన్ని అందుకున్న రవిబాబుకి, ఆవిరి కూడా సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి.